[ఫైర్ఫాక్స్లో కొత్త విశేషాలు] సరికొత్త ఫైర్ఫాక్స్తో మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడం ఇప్పుడు మరింత తేలిక మరియు వేగవంతం. నవీకరించబడిన హోమ్ పేజీతో సాధారణంగా ఉపయోగించే మెనూ ఎంపికలను ఇప్పుడు సులువుగా చేరుకోవచ్చు. దింపుకోళ్ళు, పేజీకలు, చరిత్ర, యాడాన్లు, సింక్ మరియు అమరికల వంటివి. [కొత్త ట్యాబ్ పేజీ] దీనికి కూడా మెరుగులు దిద్దాం. కొత్త ట్యాబ్ పేజీతో, ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్లను ఇప్పుడు ఒకే నొక్కుతో మీరు తేలికగా చేరుకోవచ్చు. ఈ కొత్త ట్యాబ్ పేజీని వాడుకోడానికి, మీ విహారిణిలో పైన ఉన్న '+'ను నొక్కి కొత్త ట్యాబుని సృష్టించండి. కొత్త ట్యాబ్ పేజీ ఇప్పుడు మీరు ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్ల నఖచిత్రాలను చూపిస్తుంది. నఖచిత్రాలను కావలసిన చోటికి లాగివదిలి వాటి క్రమాన్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కొత్త ట్యాబ్ పేజీని అనురూపించుకోవచ్చు. ఒక సైటుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి పిన్ను బొత్తాన్ని నొక్కండి, లేదా సైటుని తొలగించడానికి 'X' బొత్తాన్ని నొక్కండి. ఖాళీ కొత్త ట్యాబ్ పేజీని తిరిగి పొందడానికి ఈ పేజీలో కుడివైపు పైన ఉన్న 'పట్టిక' ప్రతీకాన్ని నొక్కవచ్చు. ఇప్పుడే సరికొత్త ఫైర్ఫాక్స్ని తెచ్చుకుని నేటి నుండే ఈ కొత్త సౌలభ్యాలను ఉపయోగించుకోండి!