0:00:00.617,0:00:04.629 [ఫైర్ఫాక్స్లో కొత్త విశేషాలు] సరికొత్త ఫైర్ఫాక్స్తో మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడం ఇప్పుడు మరింత తేలిక మరియు వేగవంతం. 0:00:05.065,0:00:10.565 నవీకరించబడిన హోమ్ పేజీతో సాధారణంగా ఉపయోగించే మెనూ ఎంపికలను ఇప్పుడు సులువుగా చేరుకోవచ్చు. 0:00:10.719,0:00:15.342 దింపుకోళ్ళు, పేజీకలు, చరిత్ర, యాడాన్లు, సింక్ మరియు అమరికల వంటివి. 0:00:15.588,0:00:18.868 [కొత్త ట్యాబ్ పేజీ] దీనికి కూడా మెరుగులు దిద్దాం. 0:00:19.206,0:00:25.530 కొత్త ట్యాబ్ పేజీతో, ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్లను ఇప్పుడు ఒకే నొక్కుతో మీరు తేలికగా చేరుకోవచ్చు. 0:00:25.823,0:00:31.818 ఈ కొత్త ట్యాబ్ పేజీని వాడుకోడానికి, మీ విహారిణిలో పైన ఉన్న '+'ను నొక్కి కొత్త ట్యాబుని సృష్టించండి. 0:00:31.972,0:00:38.911 కొత్త ట్యాబ్ పేజీ ఇప్పుడు మీరు ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్ల నఖచిత్రాలను చూపిస్తుంది. 0:00:39.034,0:00:44.138 నఖచిత్రాలను కావలసిన చోటికి లాగివదిలి వాటి క్రమాన్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కొత్త ట్యాబ్ పేజీని అనురూపించుకోవచ్చు. 0:00:44.215,0:00:49.030 ఒక సైటుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి పిన్ను బొత్తాన్ని నొక్కండి, లేదా సైటుని తొలగించడానికి 'X' బొత్తాన్ని నొక్కండి. 0:00:49.261,0:00:54.830 ఖాళీ కొత్త ట్యాబ్ పేజీని తిరిగి పొందడానికి ఈ పేజీలో కుడివైపు పైన ఉన్న 'పట్టిక' ప్రతీకాన్ని నొక్కవచ్చు. 0:00:54.876,0:00:59.473 ఇప్పుడే సరికొత్త ఫైర్ఫాక్స్ని తెచ్చుకుని నేటి నుండే ఈ కొత్త సౌలభ్యాలను ఉపయోగించుకోండి!